నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు ప్రజలకు ఏ సమస్య ఏర్పడ్డ పోలీసులను ఆశ్రయించవచ్చని వారికి పూర్తి భరోసా కల్పిస్తామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా పోలీస్ స్టేషన్లు అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ ప్రజల కోసం పనిచేస్తుందని ప్రజలు దాన్ని సద్వినియోగించుకోవాలని ఆమె కోరారు.