25-02-2025 01:21:45 AM
నిర్మల్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలో 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినించుకోవాలని సూచించారు. ఓటింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని రాజకీయ పార్టీలు కూడా తమకు సహకరించాలని పిలుపునిచ్చారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 8 చెక్ పోస్టల్ ఏర్పాటు చేసి అక్రమ మద్యం నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. ఇప్పుడు వరకు 35 38 లక్షల స్వాధీనం చేసుకున్నామని. మూడు లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆమె వివరించారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ రత్న కళ్యాణి తదితరులు ఉన్నారు.