calender_icon.png 22 February, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు

21-02-2025 08:08:59 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అన్ని స్థాయిలో ఏర్పాట్లు పూర్తిచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపై శుక్రవారం సాయంత్రం హైదరాబాదు నుంచి ఎన్నికల రాష్ట్ర ముఖ్య అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి వివరాలను ఆయనకు తెలపడం జరిగిందన్నారు. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఎనిమిది రూట్ లను ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి పొరపాటు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉంచాలని ఎన్నికల అధికారి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదన కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.