calender_icon.png 31 October, 2024 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం: భట్టి విక్రమార్క

15-07-2024 03:21:10 PM

వరంగల్ జిల్లా: వరంగల్ నుంచే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు భరోసా హామీ ఇచ్చారని సబ్ కమిటీ చైర్మన్ భట్టి అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్ లాంటి పథకాలు అమలు చేశామని తెలిపారు. రైతుబంధు ఇక సారి ఇచ్చాం ఇప్పుడు రైతు భరోసాపై అమలు కు విధి విధానాల రూప కల్పన కోసం విస్తృత స్థాయి లో ఆభిప్రాయ సేకరణ చేస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో ఒక్క రోజంతా చర్చ పెడతామని వెల్లడించారు. రైతులకు అందించే భరోసా సొమ్ము ప్రజలు టాక్స్ రూపంలో చెల్లించినవే అన్నారు. అందుకే  ప్రతి పైసా సక్రమంగా వినియోగం కోసం అన్ని వర్గాల నుంచి సూచనలు, అభిప్రాయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇన్స్యూరెన్స్ కంపెనీలతోను చర్చలు జరుపుతున్నామన్న భట్టి విక్రమార్క విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చేశామన్నారు.  రైతులు స్వచ్చగా వ్యవసాయం చేసుకోవాలి, ఆగష్టు  నాటికి రైతులకు రుణ మాఫీ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.