calender_icon.png 27 April, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం..

27-04-2025 12:53:05 AM

  1. గత పదేళ్లలో ప్రజలు కోరుకున్నది జరగలేదు
  2. ఇప్పుడే మేం పనిమొదలుపెట్టాం..చేయాల్సింది చాలా ఉంది
  3. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అనేక ప్రాజెక్టులు 
  4. భారత్ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
  5. ‘తెలంగాణ రైజింగ్’ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని దేశ, విదేశీ ప్రతినిధులకు పిలుపు 

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): సమాజంలోని అన్నివర్గాల ఆకాంక్ష లు నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం అనేక పథకాలను తీసుకొ చ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌సిటీగా తీర్చిదిద్దేందుకు అనేక ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు చేపడు తున్నామని తెలిపారు.

శనివారం భారత్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ వేదికపై ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. ‘ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు కోసం ఎన్నో దశాబ్దాల పాటు పోరాటం జరిగింది. విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు ఉద్యమానికి నాయకత్వం వహించారు. వారి పోరాటం వల్లే తెలంగాణ ప్రత్యే క రాష్ర్టం ఏర్పడింది. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడి నా గత పదేళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. రూ.20,617 కోట్లు చెల్లించి.. 25.50 లక్షల మంది రైతులను పూర్తిగా రుణ విముక్తులను చేశాం.

భారతదేశంలోనే ఇది అతి పెద్ద రుణమాఫీ. రైతులకు 24  గంటల ఉచి త విద్యుత్ అందిస్తున్నాం. రైతుభరోసా పేరు తో ఎకరాకు ఏడాదికి రూ.12వేల చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ధాన్యానికి మద్ద తు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్, రైతుబీమా, పం టల బీమాలతో రైతులకు లబ్ధి చేకూరుస్తు న్నాం’ అని చెప్పారు.  

కోటిమంది మహిళా పారిశ్రామికవేత్తలు..  

 ‘దావోస్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్‌లో జరిగిన పెట్టుబడుల సదస్సులకు మేం హాజరయ్యాం. ప్రైవేటు రంగంలో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు రూ.2.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబ డులు వచ్చాయి. మా ప్రభుత్వానికి మహిళలు, రైతులు, యువతే ప్రధాన భాగస్వా ములు. మా రాష్ర్టంలో అద్భుతమైన మహి ళా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కోటి మం ది మహిళలను కోటీశ్వరులుగా చూడాలన్నదే మా లక్ష్యం.

సోలార్ పవర్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులకు మహిళలను యజమానులను చేశాం. విద్యు త్ పంపిణీ సంస్థలు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు మహిళా సౌరవిద్యుత్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కార్పొరేట్ రవాణా సంస్థలతో పోటీపడుతూ మహిళలు 600 బస్సులను నడుపుతున్నా రు. సోలార్ ప్లాంట్లు, ఈవీ బస్సులు నడపడంలో అదానీ, అంబానీలాంటి బడా కార్పొ రేట్ సంస్థలతో మన మహిళా పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారు.’ అని సీఎం వివరించారు. 

ఆదాయం పెంచి..పేదలకు పంచడం

మూసీ పునరుజ్జీవనంతో హైదరాబాద్ ను కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. న్యూయార్క్ హడ్సన్ నది, లండన్ థేమ్స్ నది, టోక్యోలోని సుమిదాతో సహా అనేక నగరాల్లో నదీ, నదీతీర అభివృద్ధిని అధ్యయనం చేశామన్నారు.

భవిష్యత్తు లో మూసీ హైదరాబాద్ నగరానికి అతిపెద్ద ఆకర్షణగా మారి వేలాది మందికి ఉపాధిని కల్పిస్తుందన్నారు. 30వేల ఎకరాల్లో ప్రపంచస్థాయి నగరం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 370 కిలోమీటర్ల పొడవైన రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో రైలు విస్తరణ చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం.. పేదలకు పంచడమే తమ విధానం అన్నారు. త్వరలో గిగ్, యాప్ వర్కర్స్ వెల్ఫేర్ పాలసీని రూపొందించబోతున్నామన్నారు. 

తెలంగాణ రైజింగ్ బ్రాండ్ మారండి.. 

 ప్రజల జీవితాలను మార్చేందుకు తాము చేపట్టిన మిషన్‌లో చేరాలని అందరినీ ఆహ్వానిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘మేం ఇప్పుడే పని మొదలుపెట్టాం..ఇంకా చేయాల్సింది చాలా ఉంది.. మీ అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యాలను మాతో పంచుకోండి.

మీరే ‘తెలంగాణ రైజింగ్’ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి.. ’ అని పిలుపునిచ్చారు. దేశంలో కులసర్వే నిర్వహించిన తొలి రాష్ర్టంగా తెలంగాణ నిలవడం గర్వంగా ఉందన్నారు.  దేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ర్టం తెలంగాణ అని అన్నారు.  యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని, అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 60వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 

కాంగ్రెస్ పార్టీవి ప్రజోపయోగ విధానాలు..

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నీటిపారుదల, విద్యపై దృష్టి సారించారని, ఇందిరాగాంధీ ‘రోటీ, కపడా ఔర్ మకాన్’ అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.  వారి తర్వాత వచ్చిన ముగ్గురు కాంగ్రెస్ ప్రధానులు రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్‌సింగ్  ఆధునికీ కరణ, అభివృద్ధి, టెలికామ్, సాఫ్ట్‌వేర్ వంటి సాంకేతిక విప్లవాలపై దృష్టి సారించారన్నారు. వారి కృషి వల్లే భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని సీఎం కొనియాడారు.