మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవనం పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మాని ఎన్నికల ప్రచారంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలు, ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అద్దెలే కట్టలేని సర్కార్ ప్రజలకిచ్చిన రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2500, పెన్షన్లు తదితరాలకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుందని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ దందా చేసి మూటలు ఢిల్లీకి పంపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిందని విమర్శించారు.