27-03-2025 12:00:00 AM
హైకోర్టు సీనియర్ న్యాయవాదుల డిమాండ్
ముషీరాబాద్, మార్చి 26: (విజయక్రాంతి): అక్రమణకు గురైన ఎఫ్ టి ఎల్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకొని అందులో ఉన్న కట్టడాలను కూల్చాలని హైకోర్టు సీనియర్ న్యాయవాదులు ఎంఏ కవి అబ్బాసి, రిజ్వాన్ అలీ హష్మీ, మహమ్మద్ ఇంతియాజుద్దీన్, జునైద్ బషీత్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐఎంఐఎం (ఇంక్విలాబ్ పార్టీ జనరల్ సెక్రెటరీ) సమిఉల్లా ఖురేషితో కలిసి వారు మాట్లాడుతూ 1996లో రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ లో మూడు ఎకరాల 10 గుంటల ఎఫ్ టి ఎల్ ల్యాండ్ ను ప్రముఖ వ్యక్తి ఆక్రమించి అందులో భవనాలు నిర్మించార న్నారు.
ఈ విషయంపై 2022లో హైకోర్టును ఆశ్రయించగా వక్ఫ్ బోర్డ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు కలిసి కోర్టుకు నివేదిక సమర్పించాయన్నారు. దానిపై హైకోర్టు ఈనెల 19న తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. అధికార పార్టీ చెందిన ఎమ్మెల్సీ కావడం వల్ల ప్రభుత్వం చర్యలకు వెనుకడుగు వేస్తుందని ఆరోపించారు. ఎఫ్‌టిఎల్ ల్యాండ్ పై హైడ్రా కూడా ఫిర్యాదు చేశామన్నారు.
హైకోర్టు ఆదేశాలను రెవెన్యూ, మున్సిపల్, హైడ్రాలకు పంపించినట్లు చెప్పారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎఫ్టీ ఎల్ ల్యాండ్ ను కబ్జా చేస్తే సామాన్య ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. లేనిపక్షంలో హైకోర్టు ధిక్కరణ కేసు వేస్తామని వెల్లడించారు.