calender_icon.png 10 January, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు నెలల్లో ఎఫ్‌టీఎల్ నిర్ధారణ

09-01-2025 12:34:14 AM

  • హైడ్రా కమిషనర్ రంగనాథ్

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో హైడ్రా బృందం పర్యటన

రంగారెడ్డి, జనవరి 8(విజయక్రాంతి)/ఇబ్రహీంపట్నం, చార్మినార్: జంటనగరాలతో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో ఉన్న చెరువులు, కుంటల్లో ఐఐటీ, జేఎన్‌టీయూ, బిట్స్ పిలానీ విద్య సంస్థలకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుల బృందాలను రంగంలోకి దింపి మూడు నెలల్లో శాస్త్రీయంగా చెరువుల ఎఫ్‌టీఎల్ పరిర్ధరణ చేపడుతామని హైడ్రా కమీషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

బుధవారం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో పలు మున్సిపాలిటీల్లో హైడ్రా బృందం పర్యటించింది. ఈ నెల 6వ తేదీన హైడ్రా కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, ఫిర్యాదుదారులను ఆయన నేరుగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. కొన్ని సమస్యలను అక్కడిక్కడే పరిష్కారించగా, మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం చూపుతామన్నారు.

ఇబ్రహీంపట్నంలోని తుర్క  చెరువు, రాయన్ చెరువు, జిల్‌వార్ఖాన్ చెరువులను పరిశీలించారు. మేడ్చల్ జిల్లాలోని దివ్యనగర్ లేఅవుట్, సుప్రభాత్ టౌన్, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలోని సాయిప్రియకాలనీ, విద్యనగర్ కాలనీలో మల్లారెడ్డి వేసిన లేవుట్‌లో రాకపోకల సమస్యల గురించి స్థానికులతో మాట్లాడారు. తుర్కయంజాల్ చెరువు విస్తరణలో 495 ఎకరాల్లో ఉందని గుర్తించమని రికార్డుల ప్రకారం 522 ఎకరాలు ఉన్నట్లు పలు రికార్డులు ఉన్నాయని అన్ని వివరాలను క్షుణ్నంగా పరిశీలిస్తామని చేప్పారు. 

 గౌలిపుర మేకల కమేలాలో.. 

పాతబస్తీలో గౌలిపుర మేకల మండీ (కమేలా స్లాటర్ హౌజ్)ను ప్రారంభించి కమేలాపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని గౌలిపుర సూర్యవంశీ అరె కటిక సంఘం ప్రతినిధులు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, ప్రజావాణిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం హైడ్రా ఇన్స్‌స్పెక్టర్ తిరుమల్లేశ్ బృందం గౌలిపుర కమేలా స్లాటర్ హౌజ్‌ను పరిశీలించింది. సాధ్యమైనంత త్వరగా స్లాటర్ హౌజ్‌ను తెరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులను కోరారు.