calender_icon.png 28 November, 2024 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సరీలలో పండ్లు, ఔషధ మొక్కలను పెంచాలి

27-11-2024 11:30:24 PM

రెసిడెన్షియల్ పాఠశాలలో ఆహారం కలుషితం కాకుండా చూడాలి

నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి 

మునుగోడు (విజయక్రాంతి): నర్సరీలో పండ్ల మొక్కలతో పాటు, ఔషధ మొక్కలు పెంచాలని, రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు అందించే ఆహారం కలుషితం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తనిఖీ చేశారు. జమస్తాపల్లి గ్రామంలో నర్సరీని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కేంద్రానికి వచ్చిన  ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. సరైన తేమ శాతంతో వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఆదేశించారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తీసుకువచ్చేలా వ్యవసాయ అధికారుల అవగాహన కల్పించాలని చెప్పారు.

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి వంట గదిని డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ ను తనిఖీ చేశారు. వంటగదిలోనే పాత్రలను శుభ్రం చేయకుండా ఇతర చోట పాత్రలను శుభ్రం చేయాలని, ఎప్పటికప్పుడు వంటగది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఎట్టి పరిస్థితులలో ఆహారం కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ ను వంట వారిని ఆదేశించారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ కేంద్రాన్ని తనిఖీ చేసి డేటా ఎంట్రీని పరిశీలించారు. ఇప్పటివరకు 55% డేటా ఎంట్రీ పూర్తికాగా ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, తహసిల్దారు నరేందర్, ఎంపీడీవో విజయభాస్కర్, వ్యవసాయ అధికారిని పద్మ, మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు.