కరీంనగర్ సిటీ, జనవరి26 (విజయ క్రాంతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని కిసాన్ నగర్ లో గల ప్రభుత్వ వికలాంగులు, వయో వృద్ధుల వసతి గృహంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, జిల్లా సంక్షేమాధికారి కె.సబిత వార్డెన్ రాధిక పాల్గొన్నారు.