calender_icon.png 26 October, 2024 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన సంక్షేమ హాస్టళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్?

26-10-2024 12:25:45 AM

విద్యార్థులతో పాటు టీచర్లు, వార్డెన్లకూ వర్తింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2౫ (విజయక్రాంతి): సంక్షేమ హాస్టళ్లపై విశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరును సంక్షేమ హాస్టళ్లకు వర్తింపజేయబోతోంది. అందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లలో ఈ తరహా హాజరును అమలు చేస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు కొన్నేళ్ల క్రితం బుక్‌లో హాజరును నమోదు చేసేవారు. తర్వాత బయోమెట్రిక్ హాజరు తీసుకొచ్చారు. ప్రస్తుతం గిరిజన సంక్షేమ హాస్టళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ తీసుకొచ్చారు. 

సంక్షేమ హాస్టళ్లపై విశ్వాసం పెంచేలా..

సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య, సరుకుల వివరాలు సరిగా ఉండవనే అపవాదు ఉండేది. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు లోకి వచ్చాక అది కొంతమేరకు తొలగింది. కాగా, ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా గిరిజన సంక్షేమ శాఖ హాస్టళ్లపై మరింత విశ్వాసం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భా గంగా గిరిజన సంక్షేమ హాస్టళ్లలోనూ ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు జరుగుతోంది.

హైదరాబాద్ జిల్లాలోని రెండు గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, 2 హాస్టళ్లలోని దాదాపు 600 మంది విద్యార్థుల హాజరును ప్రతిరోజు ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో సంబంధిత ఉపాధ్యా యులు, వార్డెన్లు నమోదు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు నమోదు కాగానే ఏ పాఠశాల, హాస్టల్‌లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారనే సంఖ్య ఎప్పటికప్పుడు గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన పోర్టల్‌లో నమోదవుతు న్నట్లు తెలుస్తోంది.

హాజరుపై అనుమానం వస్తే ఆన్‌లైన్‌లోనే హాజరైన విద్యార్థులు ఎంతమంది, గైర్హాజరయిన వారెంతమంది అనే వివరాలు అధికారులకు తెలిసిపోతున్నాయి. ఎఫ్‌ఆర్‌ఎస్‌తో గిరిజన పాఠశాలల్లోని విద్యార్థుల హాజ రు శాతాన్ని పెంచడంతో పాటు హాస్టళ్లలోని సరుకుల నిర్వహణలో అవకతవకలు జరుగకుండా గిరిజన సంక్షేమ శాఖ పటిష్ట చర్యలు నిర్వహిస్తోంది.

అయితే, ఎఫ్‌ఆర్‌ఎస్ నమో దు చేసేందుకే దాదాపు అరగంటకు పైగా సమయం పడుతుండటంతో మొదటి క్లాస్ కు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. కాగా త్వరలో బీసీ, ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలోనూ ఈ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఉపాధ్యాయులకూ తప్పనిసరి

గిరిజన సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులతో పాటు ఉపాధ్యా యులు, వార్డెన్లు, సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును తప్పనిసరి చేశారు. దీంతో వారంతా సమయవేళలను పాటించడంతో పాటు విద్యార్థులకు అందుబాటులో ఉండి బోధ న, విధులను నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఆల స్యంగా వస్తే ఆరోజు గైర్హాజరైనట్లే లెక్క. విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయకముందే ట్రయల్ బేస్‌గా గిరిజన సంక్షేమ శాఖలోని ఉపాధ్యాయులు, వార్డెన్లు, సిబ్బందికి అమలు చేశారు.