calender_icon.png 15 November, 2024 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్తంభించిన మణిపూర్

15-11-2024 12:28:59 AM

పౌరుల కిడ్నాప్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బంద్

ఇంఫాల్, నవంబర్ 14: పౌర హక్కుల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం మణిపూర్‌లో సంపూర్ణ బంద్ అమలైంది. నాగాల ఆధిపత్యం ఉన్న తమెంగ్‌లాంగ్ జిల్లా పరిధిలోని జిరిబామ్ గ్రామంలో తీవ్రవాదులు మంగళవారం రాత్రి నిత్యవ సర సరుకులు రవాణా చేస్తున్న రెండు ట్రక్కులను తగులబెట్టి ముగ్గురు మహిళలతో పాటు ముగ్గురు చిన్నారులను అపహరించడంతో అక్కడి 13 పౌర హక్కుల సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.

దీంతో విద్యాసంస్థలు, వ్యాపా ర సముదాయాలు మూతపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక కార్యక్రమాలు, రోజువారీ పనులు నిలిచిపోయాయి. ఇంఫాల్ లోయలో ఒకటిరెండు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అక్కడి ప్రభుత్వం భారీగా అదనపు కేంద్ర పారా మిలటరీ బలగాలు, 218 కంపెనీలకు చెందిన కేంద్ర సాయుధ పోలీస్ (సీఏపీఎఫ్) బలగాలు, సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌కు చెందిన బలగాలను రాష్ట్రమంతటా మోహరించారు. జవాన్లు ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేపట్టారు.