మంత్రి తుమ్మల వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): రుణమాఫీకాని రైతుల వివరాను బుధవారం నుంచి ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం వ్యవసాయ శాఖ కార్యదర్శి గోపీ మాట్లాడుతూ 2024 15 ఆగస్టు నాటికి 22, 37,848 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల లోపు ఉన్న పంట రుణమా మాఫీ చేసినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల నిర్దారణ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్ తయారు చేసినట్లు, ఈనెల 25, 26 తేదీల్లో అన్ని మండలాలలో టెస్టు ట్రయల్ చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో ప్రతి జిల్లాలో గ్రామాల వారీగా మండల వ్యవసాయ అధికారి సర్వే చేస్తారని తెలిపారు. ప్రతి మండల వ్యవసాయ అధికారి గ్రామాల వారీగా ప్రణాళికలను తయారు చేసి దాని ప్రకారంగా వివరాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. తప్పుగా నమోదైన 1,24,604 ఆధార్ వివరాలను సంబంధిత బ్యాంకులకు సరిచేయడానికి ఇచ్చినట్లు, ఇప్పటివరకు 41,339 ఆధార్ వివరాలను సరిచేసినట్లు తెలిపారు.