calender_icon.png 1 March, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కాలమేగా కరిగింది నుంచి ఊహలోన ఊసులాడే... రిలీజ్

01-03-2025 12:00:00 AM

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కాలమేగా కరిగింది’. ఈ సినిమాను సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. సింగార మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఈ సినిమా నుంచి ‘ఊహలోన ఊసులాడే..’ పాటను విడుదల చేశారు.

ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ బ్యూటిఫుల్ గా కంపోజ్  చేయగా.. సింగార మోహన్ క్యాచీ లిరిక్స్ రాశారు. సాయి మాధవ్, ఐశ్వర్య దరూరి ఆకట్టుకునేలా పాడారు. ‘పూల వాననా వాలుతుంది మీన, రాగమేళమా కూయమంది కూన, వాయు వేగమా తరుముతుంది లోన,  ఈ వేళలో.. గాలి వానలే రాలుతున్న బాట’  అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.