16-03-2025 01:54:21 AM
ఏపీలో ‘రాబిన్‌హుడ్’ సందడి
హీరో నితిన్ నుంచి వస్తున్న కామెడీ మూవీ ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. కేతికశర్మ ప్రత్యేక గీతంతో అలరించనుంది. ఇంకా ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. అతిథి పాత్ర లో కనిపించనున్నారు. కాగా, అతని ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో వార్నర్ షార్ట్ హెయిర్ కట్, ట్రెండీ దుస్తుల్లో ఆకట్టుకుంటున్నారు. ‘బౌండరీ నుంచి బాక్సాఫీస్‌కు వస్తున్న వార్నర్‌కు భారత సినిమా పరిశ్రమలోకి స్వాగతం’ అన్న వ్యాఖ్యను ఈ పోస్టర్‌పై రాసి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మార్చి 28న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి డీవోపీ: సాయిశ్రీరామ్; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; ఎడిటర్: కోటి; ఆర్ట్ డైరెక్టర్: రామ్‌కుమార్; ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, విక్రమ్ మోర్.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూ పొందిన ‘రాబిన్‌హుడ్’ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలై కంటెంట్ సినీప్రియుల్లో అంచనాలు పెంచేసింది. ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు చిత్రబృందం ప్రత్యేక పర్యటన చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ ప్రమోషనల్ టూర్ కొనసాగుతోంది. హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ వెంకీ కుడుముల శనివారం రాజమండ్రి, భీమవరం పట్టణాల్లో సందడి చేశారు. రేపు కాకినాడను సందర్శించనున్నారు.