calender_icon.png 15 October, 2024 | 6:51 AM

విద్యార్థి నేత నుంచి గ్యాంగ్‌స్టర్

15-10-2024 02:22:51 AM

లారెన్స్ బిష్ణోయ్ నేరప్రస్థానం

మరో డీ గ్యాంగ్‌గా ప్రచారం

రక్షణ కవచాలుగా పలు ప్రత్యామ్నాయాల ఏర్పాటు

ముంబై: స్టూడెంట్ లీడర్‌గా ఉన్న వ్యక్తి గ్యాంగస్టర్‌గా తన క్రిమినల్ యాక్టివిటీస్‌ను మొదలుపెట్టి నేడు దేశవ్యాప్తంగా ప్రముఖులందరిని టార్గెట్ చేసి చంపుతన్న నేరస్థుడు లారె న్స్ బిష్ణోయ్.

ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీని చంపడంతో మరోమారు ఈ నేరస్థుడి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా దత్తరన్‌లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించిన బిష్ణోయ్(31)కు ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ఇతను పంజాబ్ వర్సిటీలోని డీఏవో కాలేజీలో  లా కోర్సును చదివాడు.

ప్రేయసి సీజీవ దహనంతో..

స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పుడు గోల్డీబ్రార్‌తో స్నేహం కలిగింది. విద్యార్థి రాజకీయాల ముసుగులో అసాంఘిక కార్యక్రమా లు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో జరిగిన గొడవలో లారెన్స్ ప్రేయసిని అతని ప్రత్యర్థులు సజీవ దహనం చేశారు. తన శత్రువులపై పగ తీర్చుకోవడానికి క్రిమినల్‌గా మారి పోయాడు. పలు నేరాల్లో లారెన్స్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

అతని ప్రత్యర్థులు చంపేసే అవకాశం ఉండడంతో భారీ భద్రత మధ్య అతడిని ఉంచుతున్నారు. ఏ జైల్లో ఉన్నా తాను చేయాలనుకున్న పనులను మాత్రం తన గ్యాంగుతో కచ్చితంగా చేయిస్తున్నాడు. తన సోదరుడు అన్మోల్ అతనికి అండగా బయట ఉంటూ పనులను చక్కబె డుతున్నాడు. విదేశాల్లో ముఖ్యంగా కెనడాలో ఉన్న అతని గ్యాంగ్ సభ్యులు కావాల్సిన నిధు లు పంపిస్తూ అతనికి సహకరిస్తున్నారు. 

సల్మాన్ హత్యకు కుట్ర..

 పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్రల్లో తన గ్యాంగ్‌ను విస్తరించాడు. ఈ గ్యాంగ్ బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను చంపడానికి 2018లో ప్లాన్ చేసింది. ఈ కుట్ర విఫలైమంది. అప్పుడే లారె న్స్ గురించి తెలిసింది. తాము పవిత్రంగా చూసుకునే కృష్ణజింకలను సల్మాన్ వేటాడటం బిష్ణోయ్ వర్గానికి నచ్చలేదు. 2024లో హీరో ఇంటిపై కాల్పులకు పాల్పడింది. సల్మాన్‌ను చంపేందుకు 25 మందిని షూటర్లను నియమించినట్లు వార్తలు వచ్చాయి.

డ్రగ్స్, వెపన్స్ స్మగ్లింగ్..

 డ్రగ్స్,ఆయుధాలను అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు లారెన్స్ గ్యాంగ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆధిపత్యం కోసం జరిగిన గ్యాంగ్‌వార్‌లో లారెన్స్ మిత్రుడు జస్వీంద ర్‌ను జైపాల్ భుల్లర్ చంపేశాడు. తనకు అత్యం త ఆప్తుడు విక్కీ మిదుఖేడా హత్యకు ప్రతీకారంగానే పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలను లారెన్స్ అనుచరులు షూట్ చేసి చంపారు.

అంతా జైలునుంచే..

కొన్ని నెలలుగా సబర్మతీ జైలులో ఉంటున్న బిష్ణోయ్ అక్కడి నుంచే తన వ్యవహారాలను నడిపిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందుకు జైలు అధికారులు అతనికి సహకరిస్తున్నారని ఆరోపణ లు వస్తున్నాయి. ములాఖత్‌లో అతని అనుచరులు సెల్‌ఫోన్లను అందిస్తుడడంతో ఎవరు ఏం చేయాలో తన గ్యాంగ్ సభ్యులను ఆదేశిస్తున్నాడు. తన గ్యాంగ్‌కు దేశవ్యాప్తంగా పేరు రావడానికి సొసైటీలో ప్రముఖులను టార్గెట్ చేసుకుని అక్రమంగా నిధులు వసూలు చేస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే వారిని చంపుతున్నాడు.