- డుంకీ మార్గంలో ప్రయాణం కత్తిమీద సామే
- అక్రమ ముఠాలు, మాఫియా చేతుల్లో అమాయకులు
- అత్యాచారాలు, చిత్రహింసలు అనుభవించాల్సీ వస్తోంది
- అయినా చివరికి అమెరికా చేరేది అనుమానమే
- అడిగిన డబ్బులు చెల్లించినా సరిహద్దు దాటడం గగనమే
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: అమెరికా వెళ్లాలన్న కల ప్రతి ఒక్కరి యువతలో మొదులు తోంది. డబ్బు, సౌకర్యాలు, ఉపాధి అవకాశాలతో కూడిన జీవితం.. అసంఖ్యాక భారతీ యులతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఊరిస్తోంది. చాలాకాలంగా ఆకర్షిస్తోంది. అమెరికన్ డ్రీమ్స్‌ను నెరవేర్చుకునేందుకు వేలాది మంది భారతీయులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ అక్రమంగా నైనా యూఎస్‌కు చేరుకుని తమ ఆశలు నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. దట్టమైన అరణ్యాలు, కఠిన మైన భూభాగాలు, అస్థిర జలాల గుండా డుంకీ మార్గంలో ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో మాఫియా చేతుల్లో చిక్కుకుని అత్యాచారాలకు సైతం గురవుతున్నారు. మరికొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా, అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న దేశా ల్లో భారత్ మూడో అతిపెద్ద దేశంగా ఉంది.
ఎన్నో ఆటంకాలు దాటితేనే
ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ చిత్రంలో లండన్ వెళ్లేందుకు అందులో పాత్రధారులు తీవ్రంగా ప్రయత్నిస్తారు. వీసా లేకుండా బ్రిటన్ వెళ్లేందుకు అక్రమ మార్గాల్లో ఎలా వెళుతారు? ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి? ఇలా ప్రతి అంశా న్ని చిత్రంలో ప్రస్తావించారు. అయితే ఇలా డుంకీ మార్గంలో ప్రయాణించేవారిలో ఏటా 10 శాతం మంది చనిపోతారు లేదా భద్రతా దళాలు చంపేస్తాయని ఓ ఏజెంట్ వెల్లడించాడు.
ఇలా అక్రమంగా యూఎస్‌కు చేర్చేందుకు మానవ అక్రమ రవాణాదారులు ఒక్కొక్కరి నుంచి దాదాపు 50 వేల నుంచి లక్ష డాలర్లు వసూలు చేస్తారు. ఇలా డుంకీ మార్గంలో ప్రయాణించేవారు పనా మా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల వంటి సెంట్రల్ అమెరికా దేశాలను దాటా ల్సి ఉంటుంది. ఇక్కడికి భారతీయులు సులభంగా వీసాలు పొందుతారు. మెక్సికో, దక్షిణ అమెరికా మధ్య ఉన్న ఈ దేశాలు ఉంటాయి. చివరగా యూఎస్‌లోకి ప్రవేశించాలంటే మెక్సికోను దాటాల్సి ఉంటుంది.
డబ్బును బట్టి మార్గం
మెక్సికో నుంచి అమెరికాకు చేరుకోవాలంటే అక్కడి ఏజెంట్లు లేదా మాఫియా ద్వారానే సాధ్యమవుతుంది. ఇందుకు అధిక మొత్తంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఓ చానెల్ చేసిన పరిశోధన ప్రకారం ఈ ప్రయాణానికి కనీసం రెండేళ్లు పడుతుంది. ఇందు లో దోపిడీ, తీవ్రమైన దాడులు, మహిళలైతే అత్యాచారాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, కొన్ని సందర్భాల్లో ముఠాల చేతుల్లో మర ణం కూడా సంభవించవచ్చని పేర్కొంది. అయితే, మెక్సికో ఒక్కటే అక్రమ వలసదారులకు మార్గం కాదు.
అమెరికాలోకి ప్రవేశించేందుకు అనేక ట్రాన్సిట్ పాయింట్లను ఉపయోగిస్తారు. ఇందులో కెనడా, బ్రెజిల్ వంటి దేశాలు ఉన్నాయి. వలసదారులు చెల్లించే డబ్బులను బట్టి ఈ మార్గాలు, ఇబ్బందులు ఆధారపడి ఉంటాయి. కెనడా, బ్రెజిల్ నుంచి వెళ్లేవారు కొంత సులభంగా అమెరికా చేరుకోగలుగుతారు. కానీ మెక్సికో ద్వారా వెళ్లాలంటే కఠిన వాతావరణ పరిస్థితులతో పాటు భద్రతా బలగాలను తప్పిం చుకుని వెళ్లాల్సి ఉంటుంది.
అక్రమ వలసలే అధికం
ప్యూరీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం అమెరికాలో దాదాపు 7.25 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారు. వీరిలో మెక్సికో, ఎల్ సాల్వడార్ నుంచి ట్రాన్సిట్ అయినవారే అధిక సంఖ్యలో ఉన్నారు. 2023లో దాదాపు లక్ష మంది అక్రమంగా యూఎస్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించి అరెస్టయ్యారని యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ డాటా తెలియజేస్తుంది. వీరిని దాటుకుని వేల మంది అమెరికాలో ప్రవేశించినట్లు తెలిపింది. అయితే ఏజెంట్లు డబ్బులు తీసుకుని మోసగించిన సంఘటనలు కూడా ఉన్నాయి. సుబాశ్ అనే వ్యక్తి వద్ద ఓ ముఠా 50 వేల డాలర్లు తీసుకుని నేపాల్‌లోని ఖాట్మండుకు తరలించారు.