calender_icon.png 26 October, 2024 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

గద్వాల నుంచి ఎస్బీఐ గద్దెపైకి

01-07-2024 12:05:00 AM

  • చైర్మన్‌గా  తొలి తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి 

సామాన్య కుటుంబం నుండి అంచెలంచెలుగా ఉన్నత స్థానాలకు 

ఎస్బీఐ షౌండేషన్ ద్వారాసేవా కార్యక్రమాలు

గద్వాల (వనపర్తి), జూన్ 30(విజయక్రాంతి) : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం, దేశంలో నంబర్ వన్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్‌గా నియమితులవుతున్న చల్లా శ్రీనివాసుల శెట్టి తెలంగాణలో సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన  59 ఏండ్ల శ్రీనివాసులు శెట్టిని చైర్మన్ పదవికి కేంద్ర ప్రభుత్వంలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిట్యూషనల్ బ్యూరో సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

కిరాణ దుకాణంతో అనుభవం

ఎస్బీఐ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్న శెట్టి తొలి తెలుగు వ్యక్తికావడం గద్వాల జిల్లాకే గర్వకారణమంటూ జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలంలోని పెద్ద పోతులపాడు గ్రామం శ్రీనివాసులు శెట్టి జన్మించారు. ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో  7వ తరగతి వరకు , గద్వాల పట్ణణంలోని ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో  8వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన శెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుకున్నారు.

అనంతరం రా జేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేశారు. తన తండ్రి గ్రామంలో చిన్న పాటి కిరాణం దుకాణాన్ని నడుపుతుండేవారు. తండ్రి కిరాణషాపులో గ్రామస్థులు తీసుకున్న అప్పులను శ్రీనివాసులు శెట్టి వసూ లు చేసేవారు. ఈ క్రమంలో చిన్ననాటి ను ండి అప్పుల వసూలు చేసిన అనుభవం ఎస్బీఐ మొండి బకాయిల వసూళ్లలో ఉపయోగపడిందని శెట్టి చెపుతుంటారు.

ఉద్యోగ ప్రస్థానం ఇలా..

1988లో ఎస్బీఐలో ప్రోబెషనరీ అధికారిగా శ్రీనివాసులు శెట్టి బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టారు. మూడున్నర దశాబ్దాల్లో గుజరాత్, హైదరాబాద్, ముంబైతో పాటు న్యూయార్క్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2020 నుంచి  ఎస్బీఐ ఎండిగా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజి విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. 

సీఎం రేవంత్ హర్షం

ఎస్బీఐ నూతన చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన ఎస్‌బీఐ చైర్మన్ పదవిని అధిరోహించడం గొప్ప సందర్భం అంటూ  సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. శ్రీనివాసులు తన కొత్త హోదాలో అనేక విజయాలను అందుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

సేవా కార్యక్రమాల్లో తనదైన శైలి..

శ్రీనివాసులు శెట్టి తన వంతుగా ప్రజలకు సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో తన స్వగ్రామం అయిన పెద్దపోతులపాడుతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల్లో పలు  కార్యక్రమాలను ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా చేపట్టారు. గ్రామంలోని పాఠశాల, అంగన్‌వాడి కేంద్రానికి రూ రూ 40లక్షల విలువ చేసే సామాగ్రిని అందజేశారు. దీంతో పాటు రోగులకు మందులను అందించేందుకు గాను ఎస్బీఐ సంజీవని వాహనాన్ని  పంపిణి చేశారు.