calender_icon.png 30 October, 2024 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుట్‌బాలర్ నుంచి షూటర్‌గా..

31-07-2024 01:38:31 AM

పారిస్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో పతకం సాధించడంలో విఫల మైనప్పటికీ నిరాశపడని సరబ్‌జోత్ మిక్స్‌డ్ టీమ్‌లో కాంస్యం సాధించి చరిత్రకెక్కాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో పతకంతో మెరిసిన సరబ్ జోత్ జీవితం కాస్త ఆసక్తికరం. 2001లో సరబ్‌జోత్ సింగ్ జాట్ కుటుంబంలో జన్మిం చాడు. సరబ్‌జోత్ సింగ్ తండ్రి ఒక రైతు. హర్యానాలో పుట్టి పెరిగిన సరబ్‌జోత్ చిన్నప్పటి నుంచి ఫుట్‌బాలర్ కావాలని కలలు కన్నాడు. కానీ 13 సంవత్సరాల వయసు వచ్చేసరికి షూటింగ్‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడు.

అయితే షూటింగ్‌లో శిక్షణ ఖరీ దుతో కూడుకున్నదని తల్లిదండ్రులు మొదట భయపడ్డారు. కానీ సరబ్‌జోత్ వారికి నచ్చజెప్పి షూటింగ్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. అభిషేక్ రానా మార్గదర్శకత్వంలో రాటుదేలిన సరబ్‌జోత్ శిక్షణ మొత్తం ఏఆర్ షూటింగ్ అకాడమీలోనే జరిగింది.  2019లో జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించడం సరబ్‌జోత్ కెరీర్‌ను మలుపుతిప్పింది. అప్పటి వరకు అనామకుడిగా ఉన్న సరబ్‌జోత్ పసిడి సాధించడంతో ఒక్కసారిగా సీనియర్ ర్యాంకింగ్స్‌లోకి అడుగుపెట్టి వెలుగులోకి వచ్చాడు.