ఐదేళ్లలో ౬ రెట్లు పెరిగిన ఎమ్మెల్యే ఆస్తులు
ముంబై, అక్టోబర్ 30: మరో 3 వారాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 288 స్థానాలకు 8,000 మంది అభ్యర్థులు నామి నేషన్ దాఖలు చేశారు. వీరిలో ఘట్‌కోపర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి పరాగ్ షా అత్యం త సంపన్నుడిగా నిలిచారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తి రూ.3,383 కోట్లు. గత ఐదేళ్లతో పోలిస్తే ఆయన ఆస్తి 575 శాతం పెరిగింది. 2019 ఎన్నికల సమయంలో పరాగ్ ఆస్తులు రూ. 556 కోట్లు మాత్రమే. ఈ అంశంపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తుండటంతో పరాగ్ స్పందించారు. అందరికీ సంప ద ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలియాలి. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నేను నిజాయితీని నమ్ముకున్న వ్యక్తిని. నేను నాయకుడిని మాత్రమే కాదు. వ్యాపారవేత్త కూడా. అంతేకాకుండా నా సంపాదనలో 50 శాతం సామాజిక సేవకే ఉపయోగిస్తా అని వెల్లడించారు.