05-03-2025 12:00:00 AM
అక్రమంగా మట్టి తరలింపుపై స్పందించిన ఎఫ్‌ఆర్‌వో చంద్రయ్య
మహబూబ్ నగర్, మార్చి 4 (విజయక్రాంతి) : ప్రభుత్వ నియమ నిబంధనలు పక్కన పెట్టి అక్రమంగా మట్టి తరలించిన నిర్వాహకులకు జరిమానా విధించాలని విజయ క్రాంతి దినపత్రిక ఫిబ్రవరి 6వ తేదీన గుట్టలను నేలను చేస్తుండ్రు అనే కథనం ప్రచురితమైంది. అటవీ శాఖ, రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న భూములకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ రోడ్డుకు వేసేందుకు వీరన్న పేట ప్రాంతంలోని గుట్ట నుంచి మట్టిని తరలించారు. ఈమెకు అటవీశాఖ అధికారులు అటవీ పరిధిలో ఉన్న గుట్టలకు సంబంధించి మట్టిని తరలించాలని రెండు టిప్పర్లను, హిటాచిని సీజ్ చేసి అడవి శాఖ కార్యాలయానికి తరలించిన విషయం విధితమే.
ఈ మేరకు అటవీశాఖ రెవెన్యూ శాఖ ఇరు శాఖలు మద్య భూములు ఉండడంతో జరిమానా వేయించింది ఆలస్యం అవుతుందని సమితి అధికారులు అప్పుడు తెలియజేశారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో స్పందించి ఆలస్యమైన అడవి శాఖ అధికారులు అక్రమంగా మట్టిని తరలించిన సంబంధిత నిర్వాహకులకు రూ 30 లక్షలు జరిమానా విధించినట్లు అటవీ శాఖ ఎఫ్‌ఆర్‌ఓ చంద్రయ్య తెలియజేశారు. అంతకుముందు అటవీ శాఖ డిఎఫ్‌ఓను వివరణ కోరగా ప్రక్రియ జరుగుతుందని జరిమానా విధించలేదని తెలిపారు. ఇప్పటివరకు అయితే జరిమానా విధించిన డబ్బులు చెల్లించలేదని ఎఫ్‌ఆర్‌ఓ తెలియజేశారు.