calender_icon.png 27 March, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇఫ్తార్ విందులతో స్నేహభావం పెంపొందుతుంది

25-03-2025 10:21:41 PM

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు... 

సంగారెడ్డి (విజయక్రాంతి): ఇఫ్తార్ విందులతో స్నేహభావం పెంపొందుతుందని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో టిజిటిఏ, టిజిఆర్ఎస్ఏ అధికారుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అల్లా దయతో అందరు సుఖశాంతులతో, సహోదర భావంతో మెలగాలని ఆకాక్షించారు. ఇఫ్తార్ విందుతో ఉద్యోగుల్లో స్నేహభావం పెరుగుతుందన్నారు. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం హర్షనీయం అన్నారు. అల్లా కృపతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. 

ఈ కార్యక్రమంలో టిజిటిఏ అధ్యక్షురాలు షేక్ హసీనా, జనరల్ సెక్రటరీ నజీమ్ ఖాన్, టిజిఆర్ఎస్ఏ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ బి.హేమంత్, కలెక్టరేట్ ఏఓ పరమేష్, అందోల్ తహసీల్దార్ విష్ణుసాగర్, జిల్లా అధ్యక్షులు మర్రి ప్రదీప్, జనరల్ సెక్రటరీ ప్రవీణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో కలెక్టరేట్ లో వివిధ శాఖలకు చెందిన ముస్లిం మైనారిటీ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.