కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): క్రీడలు స్నేహ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ చెప్పారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయడం అభినందనీయమన్నారు.
క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు నేతృత్వంలో మంగళవారం ‘రాజీవ్‌గాంధీ 18వ స్మారక అండర్-19 డే అండ్ నైట్ టీ -20 లీగ్ క్రికెట్ చాంపియన్‌షిప్-2025’ పోటీలను అంబర్‌పేటలోని వాటర్‌వర్క్స్ గ్రౌండ్‌లో దీపాదాస్ మున్షీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శులు పీ విశ్వనాథన్, తమిళనాడు ఎమ్మెల్యే జేఏ హసన్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.