calender_icon.png 10 March, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

47 ఏళ్లకు కలిసిన పూర్వ విద్యార్థులు

09-03-2025 08:37:26 PM

కామారెడ్డిలో చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న మిత్రులు..

పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తమ అనుభవాలు వెల్లడి..

కామారెడ్డి (విజయక్రాంతి): వారు పాఠశాల విడిచి 47 ఏళ్లు అయింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరిట ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓకే వేదికపై కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పదవ తరగతిలో వారు చేసిన అల్లరి చేసిన అల్లరి చేష్టలను గుర్తు చేసుకుని సంతోషపడ్డారు. వారిలో ఎక్కువమంది మిత్రులు రిటైర్డ్ ఉద్యోగులుగా ఉన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1978 బ్యాచ్ చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో సన్మానించుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఈ ఎన్ సి ఆర్ శ్రీధర్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు భూమయ్య, భారత డైనమిక్ లిమిటెడ్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ సునీల్ కుమార్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్, బాలకిషన్, ట్రాన్స్కో రిటైర్డ్ రామలింగం, ప్రముఖ వ్యాపారులు మధుసూదన్, వెంకటరమణ, వెంకటేశం, రాజేందర్ టౌన్ ప్లానింగ్ రిటైర్డ్ ఎడి భీమ్రావు, పిసిబి రిటైర్డ్ జాయింట్ గంగాధర్, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్, ఎన్ ఎల్ సి ఐ ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ మధు, జర్నలిస్టు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.