calender_icon.png 19 October, 2024 | 10:13 AM

సత్వర న్యాయంతోనే స్నేహపూర్వక సమాజం

28-07-2024 12:48:55 AM

హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్ అథారిటి చైర్మన్ సుజయ్‌పాల్ 

కామారెడ్డి, జూలై 27(విజయక్రాంతి) : సామాజిక బాధ్యతతో తగాదాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్ అథారి టి చైర్మన్ సంజయ్‌పాల్ సూచించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కమ్యూ నిటీ మీడియేషన్ వలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. 2023లో తీసుకొచ్చిన మీడియోన్ యాక్ట్ ద్వారా సేవాభావం కలిగిన కొందరిని కమ్యూనిటీ మీడియెషన్ వలంటీర్లుగా ఎంపిక చేశామన్నారు. చిన్న చిన్న తగాదాలతో పోలీస్‌స్టేషన్, కోర్టుల వరకు వెళ్లి సమయం, ధనం వృథా చేసుకుంటున్నారని ఇరు వర్గాల వారిని సము దాయించి సమస్యను పరిష్కరిస్తే సత్వర న్యా యంతో పాటు స్నేహపూర్వక సమాజం నిర్మితమవుతుందన్నారు.

కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి మీడియేషన్ సెంటర్ల ద్వారా 5 వేల పైగా సమస్యలకు పరిష్కారం దొరికిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యులు సెక్రటరీ పంచాక్షరి, కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సీహెచ్ వీఆర్‌ఆర్ వరప్రసాద్, అడిషనల్ జిల్లా న్యాయమూర్తి లాల్‌సింగ్ శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, ఆడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీక్షా, జిల్లా న్యాయసేవాధికార సూపరిండెంట్ చంద్రసేన్‌రెడ్డి పాల్గొన్నారు.