calender_icon.png 13 December, 2024 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాన్ని ఎవరు గౌరవిస్తారో వారికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్

13-12-2024 05:23:30 PM

ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో, వారిపై చట్టపరమైన పోలీసింగ్

(రౌడీ షీటర్స్)  మీ పిల్లల భవిష్యత్తు కోసం నేరా ప్రవృత్తి వీడి  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారండి..

పెద్దపల్లి జిల్లాలోని రౌడీ షీటర్స్ కు కౌన్సెలింగ్ లో రామగుండం సిపి శ్రీనివాస్...

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో రౌడీ షీటర్స్ లలో మార్పులో భాగంగా మానవీయ కోణంతో (ఫర్ బెటర్ లైఫ్) అనే నినాదంతో రౌడీ షీటర్స్ లో మార్పు కోసం కౌన్సిలింగ్ నిర్వహించి ఒక అవకాశం ఇస్తున్నామని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లిలోని స్వరూప గార్డెన్స్ లో రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్ లకు కౌన్సిలింగ్ లో సీపీ మాట్లాడుతూ.. నేటి నుండి రౌడీ షీటర్స్ ఉన్న వారు ఎలాంటి కేసులోనైనా, గ్రూపు తగాదాలలో ఐనా ఎవరి ప్రోద్బలంతో, ప్రలోబలతోనైనా నేరాలలో పాలుపంచుకోకూడదని ఈ కౌన్సిలింగ్ హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాలలో పాలుపంచుకుంటే చట్టంలో ఉన్న ఆక్ట్ ల ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

నేర జీవితం వీడి ప్రస్తుత సమాజంతో మంచి జీవితం గడుపుతూ హుందాగా జీవించాలని, నేరస్తులు తొందర పాటులో నేరాలు చేసిన, ఎలాంటి తప్పు చేయని వారి కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, రౌడీ షీటర్స్ తన పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని మార్పు తెచ్చుకోవాలని, రౌడీ షీటర్ అనే ఓ పదం తమ బిడ్డల భవిష్యత్ కూడా నాశనం చేస్తుందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన లక్ష్యంగా స్పష్టమైన ఆదేశాలు జారి చేయడం జరిగిందని, దానికి  అనుగుణంగా గంజాయి నిర్ములనపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని, ఎవరైనా గంజాయి అమ్మిన, కొని సరఫరా చేసిన, అక్రమ రవాణా చేసిన, తాగిన, నిల్వ ఉంచిన, ప్రలోభాలకు గురై భూ కబ్జాలు, ప్రజలు చేయటం, భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం చేయడం, ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని, పిడి యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు.

ప్రతి ఒక్కరి కదలికలు, చర్యలు మాకు తెలిసిపోతాయాన్నారు. భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి సత్ప్రవర్తంతో ఉండాలని, నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత పది సంవత్సరాల నుండి రౌడి షీట్ ఓపెన్ తరువాత నుండి ఎప్పటి వరకు మీ యొక్క ప్రవర్తన కదలికలు తెలుసుకొని రికార్డ్స్ పరిశీలించి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి పూర్తిగా మారితే రౌడీ షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని సీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, గోదావరిఖని, పెద్దపల్లి సబ్ డివిజన్ సీఐ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.