calender_icon.png 7 January, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో పోలీసులు, న్యాయవాదుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

05-01-2025 10:58:47 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్-2 గ్రౌండ్ లో ఆదివారం పోలీసులు, న్యాయవాదులు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. న్యాయవాదుల టీం కెప్టెన్ గా బెల్లంపల్లి సివిల్ జడ్జి జె. ముఖేష్, పోలీస్ టీం కెప్టెన్ గా ఏసీపీ ఏ.రవికుమార్ లు వ్యవహరించారు. న్యాయవాదుల టీంలో చిప్ప మనోహర్, చేను రవికుమార్, మాదరి రాకేష్, అనిల్, సుధాకర్, రాజు, జూబైర్, సందీప్, అహ్మద్, సతీష్, ఆదిత్యలు ఆడగా, పోలీస్ టీంలో సిఐలు ఎన్. దేవయ్య, సయ్యద్ అఫ్జలొద్దిన్, కుమారస్వామిలతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు ఆడారు. మ్యాచ్ లో పోలీస్ టీం, న్యాయవాదుల టీంపై విజయం సాధించింది. గెలుపొందిన పోలీస్ టీం ను సివిల్ జడ్జి జె.ముఖేష్ అభినందించి ఏసీపి రవికుమార్ నేతృత్వంలో పోలీస్ టీంకు ట్రోఫీని అందజేశారు.