calender_icon.png 27 April, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండ్రోజుల్లో దోస్త్ నోటిఫికేషన్!

26-04-2025 11:56:54 PM

ఈసారి రెండు విడుతల్లోనే సీట్ల భర్తీ...

హైదరాబాద్ (విజయక్రాంతి): 2025 విద్యాంసవత్సరానికి డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ రెండు, మూడు రోజుల్లో విడుదలకానుంది. ఈమేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విడుదల కాగా దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంది. ఈ సారి దోస్త్ ప్రవేశాలను రెండు విడుతల్లోనే పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.

గతంలో మూడు విడుతల్లో ప్రవేశాలు కల్పించి, ఆ తర్వాత మరో రెండు విడుతల్లో అవకాశం కల్పించేవారు. అయినా పూర్తి స్థాయిలో సీట్లు నిండేవికావు. ఈ సారి రెండు విడుతల్లోనే సీట్లను భర్తీచేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే డిగ్రీలో బకెట్ సిస్టంను రద్దుచేయాలని ఉన్నత విద్యామండలి కోరగా, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ సారికి డిగ్రీలో బకెట్ విధానాన్ని కొనసాగించనున్నారు.