12-03-2025 10:10:09 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందా పురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో కోదాడ పట్టణానికి చెందిన తక్ థీర్ (టీ స్టాల్) హోటల్ కూరపాటి రంగారావు సతీమణి పూర్ణ కుమారి మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థంగా ఆశ్రమము నందు మిగిలిన కూరగాయలు పండ్లు పెరుగు తదితర వస్తువులు నిలువ చేయుటకై ఫ్రిజ్ ను సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరావు. ద్వారా అందజేశారు. అనంతరం ఆశ్రమంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి పాండు విజయలక్ష్మి నాగన్న నూనె తదితరులు పాల్గొన్నారు.