calender_icon.png 22 December, 2024 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలి ఇంట్లో అగ్ని ప్రమాదం

14-09-2024 11:40:52 AM

సకాలంలో అగ్ని మాపక అధికారులు రావడంతో తగ్గిన ఆస్తి నష్టం

ఊపిరి పీల్చుకున్న ఇంటి యజమాని

కామారెడ్డి ( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఫ్రిజ్ కంప్రెసర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం ఇవ్వరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన రైమ్ ఇంట్లో శనివారం ఉదయం పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఫర్నిచర్ నిత్యవసర సరుకులు కాలిపూర్ అయ్యాయి. ప్రమాదాన్ని గ్రామానికి చెందిన స్థానికులు బిందెలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పి వేశారు. దీంతో ఆస్తి నష్టం తప్పింది కేవలం ఫర్నిచర్ ఫ్రిజ్ మాత్రమే అగ్నికి కాలి బూడిద అయ్యాయి. దీంతో ఎవరికి ప్రాణనష్టం జరగలేదు.