calender_icon.png 15 January, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రిడ్జ్ కంప్రెషర్ పేలి మంటలు

15-09-2024 01:56:24 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఫిడ్జ్ కంప్రెషర్ పేలింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రైమ్ అనే వ్యక్తి ఇంట్లో శనివారం ఉదయం ఇంట్లోని ఫ్రిడ్జ్ కంప్రెషర్ పెద్ద శబ్దంతో పేలి మంటలు వ్యాపించాయి. దీంతో కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేయడంతో బాధిత కుటుంబం ఊపిరి పీల్చుకున్నది. ప్రమాదంలో కొన్ని గృహోపకరణాలు మాత్రం దెబ్బతిన్నాయి.