జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కొత్తపల్లి, అక్టోబరు 18: మహిళా సమస్యలన్నింటికీ పరిష్కార వేదికగా శుక్రవారం సభ నిలుస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం మహి ళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మండలంలోని నాగులమల్యాల గ్రామంలో ని ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం సభ కా ర్యక్రమాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చని, సభానంతరం దరఖా స్తులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రతి మహి ళ, గర్భిణి, బాలింత శుక్రవారం సభకు తప్ప క హాజరు కావాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడి సిబ్బంది, అధికారు లు శుక్రవారం సభకు హాజరవుతారని, దీని వల్ల సమస్య అప్పటికప్పుడే పరిష్కారం లభి స్తుందని అన్నారు.
ఆరోగ్య మహిళా కార్యక్ర మంలో జిల్లాలో మహిళలందరికీ సుమారు 50 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నా మని, వీటిని ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అడి షనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా సంక్షే మ అధికారి ఎం సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, తదితరులు పాల్గొన్నారు.