మంచిర్యాల,(విజయక్రాంతి): పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.పాండురంగ శర్మ, వైస్ ప్రిన్సిపల్ పత్తి సునీత, అధ్యాపక బృందం, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.