calender_icon.png 10 March, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మంచినీటి పైపులైన్ పనులు పూర్తి చేయాలి

21-01-2025 11:31:33 PM

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు...

కూకట్‌పల్లి (విజక్రాంతి): రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కూకట్‌పల్లి నియోజకవర్గంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాటర్ వర్క్స్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధానంగా గతంలో ప్రారంభించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో పరిధిలోని ఆయా డివిజన్‌ల పరిధిలోని నూతనంగా చేపట్టాల్సిన మంచినీటి పైప్‌లైన్ పనులు విషయమై ఇటీవలే వాటర్ వర్క్స్ ఎండీని కలిసి విన్నవించడం జరిగిందని అధికారులకు తెలిపారు. మంచినీటి పైప్‌లైన్ పనుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పైప్‌లైన్ నిర్మాణ పనుల విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేసి ప్రజలకు మంచినీటి సదుపాయం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి వాటర్ వర్క్స్ జీఎం ప్రభాకర్, మెగా ఇంజనీరింగ్ విభాగం అధికారి అజయ్ తదితరులు పాల్గొన్నారు.