రాష్ట్రంలో మినరల్ వాటర్ పేరిట కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం ‘మూడు పూవులు ఆరు కాయలు’గా సాగుతోంది. పల్లెలు, పట్టణాలు, నగరాలలో గుర్తింపు లేని వాటర్ ప్లాంట్‌లు పుట్ట గొడుగుల్లా పుట్టుకు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నీటి ప్రాసెసింగ్ సరిగా లేక, కాలుష్య కారకాలవల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది. పిల్లలనుంచి పెద్దలవరకు అందరూ కీళ్ల నొప్పులు, విరోచనాల బారిన పడవచ్చు. అధికారులు అటువంటి వాటర్ ప్లాంట్‌లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి.
కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా