హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): నగరంలోని అత్తాపూర్‌లో గల ఎస్టీపీ(మురుగు శుద్ధి కేంద్రా)లను ఫ్రెం చ్ బృందం సందర్శించింది. లెస్ అటెలియర్స్ డి సెర్జీ అనే ఇంటర్నేషనల్ అర్బన్ ప్లానింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘వాటర్ అండ్ మెట్రో పాలిటైజేషన్ ఎ బయోక్లుమైటిక్ సిటీఆఫ్ లేక్స్’ అనే అంశంపై అంతర్జా తీయ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. మూసీ రివర్ డెవలప్‌మెంట్‌పై చేస్తున్న ఈ వర్క్‌షాప్‌లో భాగంగా ఫ్రెంచ్ బృందం సోమవారం అత్తాపూర్‌లోని ఎస్టీపీలను సందర్శించింది.
వారికి జలమండలి జనరల్ మేనేజర్ వాస సత్యనారాయణ వివరాలను తెలిపారు. ఎస్టీపీల పరిశీలనకు వచ్చే బృందం కోసం జలమండలి పలువురు నోడల్ అధికారుల్ని నియమించింది. ఈనెల 28న జలమండలిని విదేశీ బృందం సందర్శించనుంది. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.