21.55 లక్షలు రికవరీ
బాధితుల ఖాతాల్లోకి సొమ్ము జమ
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబ ర్ 8 (విజయక్రాంతి) : రెండు వేర్వేరు సైబర్ నేరాల్లో బాధితులు పొగొట్టుకున్న రూ. 21.55 లక్షల సొమ్మును (సీసీఎస్) సైబర్ క్రైమ్ పోలీసులు తిరిగి ఇప్పించినట్లు డీసీపీ ధారా కవి త తెలిపారు.
మీ పేరుతో వచ్చిన పార్శిల్‌లో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, మేం ట్రాయ్, సీబీఐ అధికా రులమంటూ నగరానికి చెందిన ఓ వృద్ధుడికి ఫోన్ చేసి అతడి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 8.05 లక్షలు తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. మరో ఘటనలో.. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలోనే మంచి లాభాలిప్పిస్తా మం టూ నమ్మించి బాధితుడి వద్ద నుంచి రూ.13.5 లక్షలు కాజేశారు.
ఈ రెండు ఘటనలపై వేర్వేరుగా కేసు నమోదు చేసుకొని సైబర్ ఇన్‌స్పెక్టర్లు మధుసూదన్‌రావు, ఎస్.నరేశ్ బృందాలు దర్యా ప్తు జరిపాయి. నిందితుల బ్యాంకు ఖాతాలను గుర్తించి వాటిని ఫ్రీజ్ చేయించారు. అనంతరం నాంపల్లి 12వ అదనపు మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, మేజిస్ట్రేట్ ఈశ్వర య్య ఆదేశాలతో రూ. 21.55 లక్షల నగదు ను మంగళవారం బాధితుల ఖాతాల్లోకి బదిలీ చేయించినట్లు డీసీపీ తెలిపారు.