calender_icon.png 25 November, 2024 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగంతోనే బానిసత్వానికి విముక్తి

25-11-2024 03:20:32 AM

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

మెదక్, నవంబర్ 24 (విజయక్రాంతి): భారత రాజ్యాంగం ద్వారా బానిస బతుకులకు విముక్తి కలిగిందని, అలాంటి రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పిలుపునిచ్చారు. టీఎన్జీవో నేత జెల్ల సుధాకర్, దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యం లో స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో 75 ఏళ్ల భారత రాజ్యాంగ ఉత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బక్కి వెంకటయ్య హాజరై మాట్లాడారు. దేశానికి దక్షిణ భారతదేశంలో రెండో రాజధాని ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుచూపుతో ప్రతిపాదించారని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది పొన్నం దేవరాజ్‌గౌడ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, అంబేద్కర్ కాంస్య విగ్రహ కమిటీ అధ్యక్షులు గంగాధర్, బహుజన నాయకులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.