calender_icon.png 1 April, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీడీపీ సంస్కరణలతోనే తెలంగాణకు స్వేచ్ఛ

29-03-2025 10:06:35 PM

జనగామ (విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిన సంస్కరణలతోనే తెలంగాణలో పటేల్​ పట్వారీ వ్యవస్థ రద్దై, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని ఆ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య అన్నారు. శనివారం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జేరిపోతుల కుమార్ అధ్యక్షతన జనగామలోని ఆర్ అండ్​ బీ గెస్ట్ హౌస్ ఎదురుగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో 1982 మార్చి 29న తెలంగాణ గడ్డపై టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని గుర్తు చేశారు.

తెలుగుదేశం హయాంలోనే పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలన, మాండలిక వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన వంటివి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్కాల శ్రీనివాస్, ఆకుల దుర్గాప్రసాద్, రొండ్ల ఎల్లారెడ్డి, ఎండీ.సిరాజ్, కోర్నెపాక ఉపేందర్, కొత్తపల్లి ధనసాగర్, ఆకుల శ్రీనివాస్, సుద్దాల సురేష్, ఆంజనేయులు, పాలమకుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పండ్ల పంపిణీ..

టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు జనగామ ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చీకట్ల నవీన్ గౌడ్, బైరు బాబు, ఎండీ.కలీం, ఎండీ.చోటేమియా, గొల్ల శ్రీనివాస్, సబ్బాని పాండు, ఎల్లారెడ్డి, ఎం.యాదగిరి, బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.