05-04-2025 12:00:00 AM
సుల్తానాబాద్, ఏప్రిల్04 (విజయ క్రాంతి): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు, పెద్దపల్లి జిల్లా స్వాతంత్య్ర సమర యోధుల సంఘం జిల్లా అధ్యక్షులు తానిపర్తి కాంతారావు అనారోగ్యం తో మృతి చెందారు. తమ స్వగ్రామం ఎలిగేడు మండలం లోని సుల్తానాపూర్ లో తుది శ్వాస విడిచారు.
కమ్యూనిస్టు నాయకునిగా ప్రజలకు సేవలు అందించారు. కాంతారావు మృతి పట్ల పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు, స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం - పెద్దపల్లి జిల్లా నాయకుల- బాలసాని వెంకటేశం, - కోలా వెంకటేశ్వర్లు,,వెలగందుల శ్రీనివాస్ లు సంతాపాన్ని వ్యక్తం చేశారు.