బెల్లంపల్లి (విజయక్రాంతి): భారత రాజ్యాంగం ద్వారానే పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించబడిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో అధ్యక్షురాలు జక్కుల శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే లేకుంటే భారతదేశ పౌరులకు హక్కులే లేవన్నారు. భారత రాజ్యాంగం పట్ల విశ్వాసంతో ప్రతి ఒక్కరు మెదలాలని సూచించారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ అధికారులు, కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే వినోద్ ప్రతిజ్ఞ చేశారు.