01-03-2025 12:15:46 AM
పిట్లం ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గౌరారం తండాలో శుక్రవారం పశుగణా భివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ అధికారి మాజిద్ అహ్మద్ ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ చికిత్స శిబిరం నిర్వహించారు. పశుగణా భివృద్ధి సంస్థ తరపున ఉచితంగా మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
అలాగే ఈ శిబిరంలో గర్భకోశ వ్యాధుల పశువులకు 22 సాధన చికిత్స, 4 దూడలకి నట్టల మందు లు, 20 దూడలకి ఇవ్వడం జరిగిందని, మొత్తము 46 పశువులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ శిబిరానికి మండల పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్, సూపర్వైజర్ తిరుపతి, మరియు గోపాల మిత్రులు ఎం శ్రావణ్, బి రాములు, గ్రామ రైతులు పాల్గొన్నారు.