calender_icon.png 4 February, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భాశయ క్యాన్సర్‌కు అపోలోలో ఉచిత వ్యాక్సినేషన్

04-02-2025 01:43:27 AM

* ప్రారంభించిన నటి మీనాక్షిచౌదరి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): గర్భాశయ క్యాన్సర్‌కు అపో  ఆస్పత్రి వారు ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అపోలో ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ విజయ్‌ఆనంద్‌రెడ్డితో కలిసి ప్రముఖ నటి మీనాక్షి చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారం  వరల్డ్ కాన్సర్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ కన్స  హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆంకో సర్జన్ డాక్టర్ రాజీవ్‌రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఆం  ఎస్‌వీఎస్‌ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ విజ  ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో కీలక దశ గురించి చెప్పారు. గర్భాశయ క్యాన్సర్‌పై తాము చేస్తు  పోరాటంలో ఇది ముందడుగు అని చెప్పారు. విస్తృతమైన టీకా ద్వారా భవిష్యత్ తరాలను రక్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.

క్యాన్సర్‌పై స్వచ్ఛందంగా తాము చేస్తున్న కార్యక్రమాలను గమ  నటి మీనాక్షి చౌదరి తమకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిందన్నారు. నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గర్వంగా ఉందన్నారు. చాలా క్యాన్సర్‌లపై అవగాహన లేకపోవడం వల్ల మహిళలు ఇబ్బందులు పడు  భయంకరమైన ఈ వ్యాధిని ముందే గుర్తించడం ద్వారా ముందడుగు వేయాలన్నారు.