calender_icon.png 11 January, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సుల్లో ఉచిత శిక్షణ

03-01-2025 10:45:59 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి సేవాసమితి ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సుల్లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ తెలిపారు. శుక్రవారం ఆయన  విలేకరులతో మాట్లాడారు. మూడు నెలల పాటు నిర్వహించనున్న వృత్తి విద్యా కోర్సుల్లో టైలరింగ్, బ్యుటీషియన్, మగ్గం వర్క్, కంప్యూటర్ కోర్స్ (డిసిఎ)లలో శిక్షణ  తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సింగరేణి/మాజి ఉద్యోగి వారి భార్య పిల్లలు, భూనిర్వాసితులు, ఏరియాలోని కేకే ఓసీపీ, ఆర్కేఓసిపి ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామాల మహిళలు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉచిత శిక్షణ కొరకు ఈనెల 4 నుండి 9వ తేదీ వరకు జి.ఎం ఆఫీస్ లోని పర్సనల్ డిపార్టుమెంట్, సింగరేణి సేవాసమితిలో దరఖాస్తులు అందచేయాలన్నారు. పూర్తి వివరాలకు 7032878575, 8688150431 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.