calender_icon.png 1 November, 2024 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

01-07-2024 12:21:08 AM

ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో శిక్షణ

దరఖాస్తులకు ఈ నెల 7 వరకు గడువు 

హైదరాబాద్, జూన్ 30 (విజయ క్రాంతి): సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపే ర్ అయ్యే అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఐఏఎస్  స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందించ నున్నట్లు ఎస్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకో సం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు జూలై 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకో వచ్చని, అభ్యర్థుల వినతి మేరకు దర ఖాస్తు గడువు పొడిగించినట్లు తెలిపా రు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు. studycircle.cgg.gov.in లేదా twd.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 6281766534 నెంబర్‌లో సంప్రదిం చాలన్నారు.