calender_icon.png 10 April, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

21 సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఉచిత శిక్షణ

29-03-2025 12:00:00 AM

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంస

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, ఇతర విభాగాల విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ కోసం నిర్వహిస్తున్న ఉచిత మాస్టర్ క్లాస్ ఒరియంటేషన్ సెషన్లను మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్, మేడ్చల్ ఎమ్మె ల్యే చామకూర మల్లారెడ్డి అభినందించారు. శుక్రవారం అకాడమీ చైర్మన్ పి. కృష్ణప్రదీప్, డైరెక్టర్ డా.భవాని శంకర్ మల్లారెడ్డి యూనివర్సిటీలో మల్లారెడ్డిని కలిసి ఉచిత శిక్షణ తరగతుల గురించి వివరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు జూన్ లో సెమినార్ నిర్వహించనున్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు. సమావేశంలో మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూషన్స్ ఆపరేషన్స్ డైరెక్టర్ ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.