calender_icon.png 22 April, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సింగ్ సిబ్బందికి ఉచిత శిక్షణ, నియామకం

21-04-2025 12:00:00 AM

జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రాఘవేందర్

సిరిసిల్ల, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): అర్హులైన నర్సింగ్ సిబ్బందికి ఉచిత శిక్షణ అందిస్తూ.. కొలువులు అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రిపుల్ విన్ ప్రాజెక్టు కింద జర్మనీలో ఉపాధి అవకాశాల కోసం అర్హులైన నర్సింగ్ సిబ్బందికి ఉచిత శిక్షణ, నియామకం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ పరిధిలోని రిజిస్టర్డ్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు.

జర్మన్ ఫెడరల్ ఎంప్లాయిమెంట్ ఏజెన్సీ (బీఏ), జర్మన్ ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (జీఐజెడ్) సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని గుర్తింపు పొందిన కాలేజీల నుంచి జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్ చేసి, 21-38 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని, ఇండియన్ నర్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తో జీఎన్ ఎం అభ్యర్థులకు కనీసం 3 ఏళ్ల ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలని పేర్కొన్నారు.

ఎంపికైన వారికి గుర్తింపు వరకు పనులకు ముందు 2300 యూరోలు (నెలకు రూ. 2.2 లక్షలు) జీతం, అలాగే గుర్తింపు తర్వాత పన్నులకు ముందు 2800 యూరోలు (2.6 లక్షలు / నెల) జీతంఅందించబడుతుంది తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు 94400 51581, 94400 48500, 94400 52081 సంప్రదించాలని, తమ రెజ్యూమ్ ను ఈ నెల 25వ తేదీ లోగా  germanytriplewin2025@gmail.comకు ఈమెయిల్ చేయాలి. అదనపు సమాచారం కొరకు, www.tomcom.telangana.gov.in సందర్శించాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రాఘవేందర్ సూచించారు.