28-08-2024 03:12:44 AM
తహసీల్దార్‌కు గ్రామస్తుల వినతి
జగిత్యాల, ఆగస్టు 27 (విజయక్రాంతి): జగిత్యాల శివారులోని మోతె చెరువును కొందరు ఆక్రమిస్తున్నారని, అక్రమార్కుల చెర నుంచి చెరువును విడిపించాలని మంగళవారం మోతె గ్రామస్తులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కబ్జాదారులు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, రెవెన్యూ అధికారులు వెంటనే చెరువు భూములను సరే చేయాలని కోరారు.