12-04-2025 11:07:00 AM
ప్రారంభించిన జిల్లా కలెక్టర్
భద్రాచలం,(విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(Indian Red Cross Society) రక్తనిధి కేంద్రం భద్రాచలంలో ఉచితంగా తలసేమియా, సికిల్సెల్ ఎనిమీయా వ్యాధి నిర్ధారణ పరీక్షలనునిర్వహించు కార్యక్రమమును జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వారి కార్యాలయంలో నుండి ప్రారంభించినారు. తలసేమియా, సికిల్సెల్ ఎనిమీయా వ్యాధి(Sickle cell anemia) రక్త హీనత పుట్టుకతో సంక్రమిస్తుందని, వారి చికిత్స కొరకు క్రమం తప్పకుండా వ్యాధి తీవ్రతను బట్టి నెలకు, రెండు రెలలకు, మూడు నెలలకు ఒక్కసారి చొప్పున వారికి రక్తం ఎక్కించి వారిని కాపాడాల్సి ఉంటుందని, ప్రజలందరూ, వైద్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కలెక్టర్ కోరారు. పేద ప్రజలు, గిరిజనుల సంక్షేమం కొరకు 1800 వ్యాధి నిర్ధారణ కిట్స్ రూ.5లక్షల వ్యయంతో ఐటిసి పి ఎస్ పి డి సారపాక వారు అందించటంతో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని అభినందించినారు. అదే విధంగా జిల్లాలో తలసేమియా, సికిల్సెల్ ఎనిమియా వ్యాధిగ్రస్తుల సంక్షేమం కొరకు రక్తదాన శిబిరములు నిర్వహిస్తామని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో డా.ఎస్.ఎల్.కాంతారావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపినారు. భద్రాచలంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో ఉచితంగా తలసేమియా, సికిల్సెల్ ఎనిమియా వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఎలక్ట్రోపర్సీస్ పద్దతిలో నిర్వహిస్తామని, ప్రైవేట్ లేబరేటరీలలో రూ. 2000లు పరీక్షలకు ఖర్చు అవుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరినారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కిట్స్ సమకూర్చినఐటిసి పిఎస్పిడి మిల్ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్, జనరల్ మేనేజర్ పి.శ్యామ్ కిరణ్ డి. రిలేషన్స్ ఆఫీసర్ చంగల్ రావు లకు రెడ్ క్రాస్ సంస్థ భద్రాచలం ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ డా.ఎస్.ఎల్.కాంతారావు, వై.సూర్యనారాయణ, జి. రాజారెడ్డి, వి.కామేశ్వరరావు, గోళ్ళ భూపతిరావు, జి.సంజీవరావు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.