సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 4: పట్టణంలో విద్యానగర్ నందు గండూరి రామస్వామి వాటర్ ప్లాంట్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ సౌజన్యంతో నిర్వహించిన టిబి నిర్థారణ, బిపి, షుగర్ పరీక్షలను మంగళవారం మాజీ పావని గండూరి పావని ్రక్రపాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..... 2016 లో అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రములో టిబి వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశ్యంతో టిబి వ్యాధి పరిక్షలు,
నివారణకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారని, దాని ఫలితంగా టిబి వ్యాధిని 75% వరకు అరికట్టడం జరిగిందని అన్నారు. నేడు కేంద్ర ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో టిబి నిర్దారణ పరీక్షలతో పాటు బిపి, సుగర్ పరిక్షలను ఉచితంగా చేసి, టిబి పాజిటివ్ వచ్చిన వారికి మూడు నెలల పాటు మందులు ఇస్తారని అన్నారు.